
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో కారు దూసుకెళ్తోంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రౌండ్ రౌండ్ కు 4వేల మెజార్టీకి పైగా ఓట్ల తో దూసుకెళ్తున్నారు.. 5 రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీపై 18584 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తోంది.. ప్రతీ రౌండ్ కు దాదాపు 4వేల ఓట్ల ఆధిక్యం కనపరుస్తుండడంతో మంత్రి తుమ్మల గెలుపు ఖాయంగా కనిపిస్తోోంది.
ఖమ్మం జిల్లా పాలేరు లో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం పొందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ తరఫున రాంరెడ్డి భార్య సుచిరిత రెడ్డి బరిలో దిగారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బరిలోకి దిగారు.
సీఎం కేసీఆర్ పాలేరును ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంత్రి కేటీఆర్ కు పాలేరు ఉప ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలేరులో పాగా వేసి తుమ్మల గెలుపుకోసం ప్రయత్నించారు. దీంతో ప్రస్తుతం పాలేరు లో ప్రస్తుతం తుమ్మల ప్రతి మెజార్టీకి దూసుకెళ్తున్నారు..