
నేటితో ప్రచారానికి తెరపడిన ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల్లో పార్టీలు వాడివేడిగా ప్రచారాన్ని కొనసాగించాయి.. కాంగ్రెస్, టీఆర్ఎస్ లు నువ్వా నేనా అన్నట్టు పోరాడాయి. కాంగ్రెస్ నుంచి రాంరెడ్డి భార్య సుచరిత, ఇక టీఆర్ఎస్ నుంచి మంత్రి తుమ్మల బరిలో ఉన్నారు..
తుమ్మల కోసం కేసీఆర్ పాలేరులో పెద్ద బెటాలియన్ నే దించేశాడు..మంత్రి కేటీఆర్ కు ఎన్నికల ఇన్ చార్జిగా బాధ్యతలు అప్పగించారు. పాలేరులోని ప్రతి మండలానికి ఒక మంత్రిని ఇన్ చార్జిగా నియమించారు. ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యేకు బాధ్యతలిచ్చారు. ఇక వార్డులకు జడ్పీటీసీలు, ఎంపీలను బాధ్యులుగా నియమించారు. అంటే ప్రతి 100 మందికి ఒక టీఆర్ఎస్ నాయకుడిని బాధ్యుడిగా పెట్టి కేసీఆర్ సాగించిన ఈ ఎన్నికల రణ క్షేత్రంలో తుమ్మల గెలుపు నల్లేరుపై నడకే కానుంది.
క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ విస్తృత ప్రచారం, అందిన సమాచారం బట్టి తుమ్మల 50 వేల మెజార్టీపైనే సాధించే అవకాశాలున్నట్టు స్పష్టం తెలుస్తోంది. రెండు రోజుల్లో జరగనున్న పోలింగ్ అనంతరం ఇదే ఫలితం పునరావృతం అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేటీఆర్ పాలేరు తుమ్మల గెలుపు గ్యారెంటీ అని ప్రకటించడం .. ఓడితే రాజీనామా చేస్తాననడంతో టీఆర్ఎస్ గెలుపుపై ఎవరికీ సందేహాలు లేవు..