
తెలంగాణలో టీఆర్ఎస్ హవా నడుస్తోంది.. పాలేరు లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు పక్కా అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి.. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను బరిలో దించి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది టీఆర్ఎస్..
టీఆర్ఎస్ కు పోటీగా రాంరెడ్డి భార్య సుచిరిత బరిలోకి దిగింది.. సుచిరితకు టీడీపీ, వైసీపీ మద్దతు తెలిపాయి. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.. హోరాహోరీ ప్రచారంతో టీఆర్ఎస్ , కాంగ్రెస్ లు విస్తృతంగా పర్యటించాయి..
కాగా పాలేరు ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 89.73 శాతం పోలింగ్ నమోదైంది.. ఈ నెల 19 న విడుదలయ్యే పాలేరు ఫలితాల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొంది. తెలుగు న్యూస్ చానాళ్లు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం అని తేలింది.. దాదాపు 50వేల మెజార్టీ ఖాయం అన్న సంకేతాలు అందాయి. దీంతో మంత్రి తుమ్మల ఎమ్మెల్యేగా ఎన్నికవడం లాంఛనమే..