పాలు పోసి పెంచితే కాటేసింది..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసిస్ ఉగ్రవాదులను పెంచి పోషించిన టర్కీ దేశం ఇప్పుడు మూల్యం చెల్లించుకుంది. టర్కీ పక్కదేశమైన సిరియాలోని ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా టర్కీ అప్పట్లో ఇస్లామిక్ గ్రూపులకు ఆర్థిక, రక్షణ సాయం చేసింది. దీన్ని అందిపుచ్చుకున్న తీవ్రవాదులు ఏకంగా సిరియాలో బలపడి ఐసిస్ ఉగ్రవాద సంస్థగా తీవ్ర రూపం దాల్చారు. మొదట్లో మద్దతిచ్చిన టర్కీ దేశం ఆ తర్వాత అమెరికా, ఐరాపా దేశాల నుంచి ఒత్తిడికి తలొగ్గి ఐసిస్ కు వ్యతిరేకంగా దాడులకు దిగింది. అమెరికా ను దాడులు చేసేలా సదుపాయాలను కల్పించింది. దీంతో అండగా ఉన్న టర్కీ రూటు మార్చడంతో ఐసిస్ ఉగ్రవాదులు సైతం తమ రూటు మార్చారు.

టర్కీ లో ని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం ఇస్తాంబుల్ లో ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. విమానాశ్రయంలో గన్ లతో స్వైర విహారం చేస్తూ మానవబాంబులుగా మారి పేల్చేసుకున్నారు. ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు చనిపోయారు. దీంతో ఇప్పుడు కానీ టర్కీ దేశానికి తాము చేసిన తప్పు తెలిసిరాలేదు.. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన టర్కీ ఇప్పుడు అదే ఉగ్రభూతం ఎదురు తిరిగి నామరూపల్లేకుండా చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *