
-హైదరాబాద్ విద్యార్థికి మొదటి ర్యాంకు
తెలంగాణ పాలీసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
మొత్తం 72.88 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు హవాను కొనసాగించారు. ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన గుడిసె తరుణ్ శ్రీనివాస్ (114) మార్కులు సాధించి మొదటి ర్యాంకు సాధించాడు. రంగారెడ్డికి చెందిన బీఎస్ కుమార్ రెడ్డి 114 మార్కులు రెండోర్యాంకు, నల్లగొండకు సాయిశ్రీ మూడో ర్యాంకు సాధించారు.