Breaking News

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అటవీ అనుమతి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అటవీ అనుమతి

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి ఒక్కోటిగా అవరోధాలు తొలగిపోతున్నాయి.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మరో ముందడుగు పడింది.ఈ ప్రాజెక్టు కోసం 500 ఎకరాల అటవీభూముల సేకరణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గురువారం సమాచారం పంపింది.కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాగునీటి పనులనే కొనసాగిస్తున్న ఈ ప్రాజెక్టులో సాగునీటి పనులనూ చేపట్టడానికి తాజా అనుమతితో మార్గం సుగమవుతోంది. ఈ ఎత్తిపోతల పథకంలో సాగునీటి పనులు చేపట్టడానికి కేంద్రం అంగీకరించింది.  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మొదటి దశ అటవీ అనుమతి లభించడం కీలక పరిణామం. శ్రీశైలం ఫోర్‌షోర్‌ నుంచి రోజుకు 1.50 టీఎంసీలు చొప్పున 90 రోజులపాటు నీటిని ఎత్తిపోసేలా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం రీ-డిజైన్‌ చేసింది. పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 7లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 5లక్షలు, నల్లగొండ జిల్లాలో 30 వేలు.. మొత్తం 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ రీ-డిజైన్‌ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం 2016 జూన్‌ 10న ఆమోదించింది. ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. తాజాగా సాగునీటి.  అవసరాల మొదటి దశ పనులపై అటవీ అనుమతులు లభించాయి.కాగా గురువారం నాడు  పాలమూరు-రంగారెడ్డి పనులను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *