పాలమూరు ప్రజలకు నీళ్లు, కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు: మంత్రి హరీష్ రావు

పాలమూరు పచ్చబడింది.కాంగ్రెస్ నేతల కళ్లు ఎర్రబడినై

ఇక పాలమూరు ప్రజలకు నీళ్లు. కాంగ్రెస్ నేతలకు కన్నీళ్లు

తెలంగాణ పునర్నిర్మాణానికి పాలమూరు సాక్ష్యమని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆవంచలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. ఇక పాలమూరు ప్రజలకు నీళ్ళు, కాంగ్రెస్ నాయకులకు కన్నీళ్ళు మిగులుతాయని చెప్పారు. మంత్రి గురువారం నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు.కల్వకుర్తి కాలువల వెంట తిరిగారూ.పనుల పురోగతి ని సమీక్షించారు. అసాధ్యం అనుకున్న ఆవంచ ఆక్విడెక్ట్ ను పూర్తి చేసి చూపామని అన్నారు. కల్వకుర్తి కింద ఈ సారి 200 రోజులు నీళ్లిచ్చామని హరీశ్ రావు తెలిపారు. గతంలో కరువు,వలసలు, ఆకలితో అల్లాడిన పాలమూరు ఇప్పుడు ఆకుపచ్చని ప్రాంతంగా మారిందన్నారు. గ్రామాలు కళ కళ లాడుతున్నట్టు చెప్పారు. ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని సి.ఎం.కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని మంత్రి తెలిపారు. కేవలం నాలుగేళ్ళలోపే వలసలు గణనీయంగా తగ్గినట్టు హరీశ్ తెలిపారు.జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెం పాడు,కోయిల్ సాగర్,బీమా ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.తుమ్మిళ్ల లిఫ్టు ను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తున్నట్టు చెప్పారు.తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్ మినహా పెద్ద  రిజర్వాయర్లు లేవు. కానీ పి.ఆర్.ఎల్.ఐ. ఎస్. పథకంతో 67.85 టీఎంసీల సామర్థ్యంతో అంజనగిరి (నార్లాపూర్), వీరాంజనేయ (ఏదుల), వెంకటాద్రి (వట్టెం), కురుమూర్తిరాయ (కరివెన), ఉద్దండాపూర్, కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతున్నది. 21 ప్యాకేజీలకుగాను ఇప్పటికే 18 ప్యాకేజీల్లో  పనులు వేగంగా జరుగుతున్నాయి. మంత్రి హరీశ్ రావు గురువారంనాడు వట్టెం రిజర్వాయర్ పనులను తనిఖీ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పురోగతిని ఉన్నతాధికారులతో వట్టెం రిజర్వాయర్ దగ్గర సమీక్షించారు.4 రిజర్వాయర్ లు,4 పంపు హౌజ్ ల పురోగతిని సమీక్షించారు.అతి తక్కువ ముంపు,అతి తక్కువ పర్యావరణ నష్టం తో అత్యంత ఎక్కువ ప్రయోజనాలతో నిర్మిస్తున్న దేశంలోనే అతి పెద్ద ప్రాజెక్టు పి.ఆర్.ఎల్.ఐ.ఎస్.అని హరీశ్ రావు అన్నారు.మొత్తం 67 టి.ఎం.సి.ల సామర్థ్యం తో నిర్మిస్తున్నప్పటికీ కేవలం 2450 ఇండ్లు ముంపునకు గురైనట్టు తెలిపారు.పాలమూరు ప్రాజెక్టు స్టేజ్1 అటవీ అనుమతి లభించిందన్నారు.వట్టెం రిజర్వాయర్ కు చెందిన 3 ప్యాకేజిలలో  పనులు శరవేగంగా సాగుతున్నట్టు హరీశ్ తెలిపారు.మంత్రి హరీశ్ రావు వెంట మంత్రులు జూపల్లి, లక్ష్మరెడ్డి, ఎం.ఎల్.ఏ.మర్రి జనార్దన్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి,  ఎస్.ఈ.రమేష్ తదితర అధికారులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *