పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైన రైతు బంధు పథకం – పల్లె పల్లెన ఎర్రబెల్లికి ఘన స్వాగతం

ఎర్రబెల్లి దయాకర్ రావు ఏ పని చేసిన ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు పథకం పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో అట్టహాసంగా ప్రారంభమైంది. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చెక్కుల పంపిణీ పాసుబుక్కులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన   ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి దాదాపు 500 బైక్‌లతో ఘన స్వాగతం పలికారు. రాయపర్తి నుండి నుండి కొత్తూరు గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి ఎడ్లబండి నడిపారు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు. కొత్తూరు గ్రామంలో లబ్ధిదారులకు పెట్టుబడి సహాయ చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు కడియం శ్రీహరి చేతుల మీదగా రైతులకు అందించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. కొత్తూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం అమ్మాపూర్ గ్రామం లో రైతుబంధు చెక్కులను, పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పంపిణీ చేశారు. అమ్మాపూర్ గ్రామం లో ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామస్తులు రైతులు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత పెద్ద వంగర మండలం అవుతా పూర్ గ్రామంలో రైతులకు రైతుబంధు చెక్కులను పాస్ బుక్ లను ఎర్రబెల్లి దయాకర్‌రావు అందజేశారు. ఇక్కడ సైతం ప్రజల మనిషి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అపూర్వ స్వాగతం లభించింది. ఆ తరువాత కొడకండ్ల మండలం నరసింగాపూర్ గ్రామం లో లబ్ధిదారులకు పాస్‌బుక్కులు చెక్కులు ఎర్రబెల్లి అందజేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామంలో రైతులకు చెక్కులు పాస్‌బుక్కులు అందజేశారు .పాలకుర్తి మండలం లక్ష్మి నారాయణ పురం గ్రామంలో, అయ్యం గారి పల్లి గ్రామంలో, కోతుల బాధ గ్రామంలో రైతుబంధు చెక్కులను శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గురువారంనాడు అందజేశారు. పల్లె పల్లెనా, గ్రామ గ్రామాన ఎక్కడ చూసినా ఎర్రబెల్లికి ఘన స్వాగతం లభించింది.నిరంతరం ప్రజాక్షేత్రంలో పయనించే ఎర్రబెల్లి  దయాకర్ రావు కు ప్రజల మనిషి దయన్న అనే పేరుంది. దటీజ్ ఎర్రబెల్లి.

WhatsApp Image 2018-05-11 at 10.54.05 (9)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (1)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (6)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (5)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (11)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (14)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (13)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (7)WhatsApp Image 2018-05-11 at 10.54.05 (23)

About The Author

Related posts