పాలకుర్తి ప్రజలు అండగా నిలవాలి

పాలకుర్తి ప్రజలు అండగా నిలవాలి

-ఎర్రబెల్లికి మద్దతుగా ఉషాదయాకర్ రావు ప్రచారం
గతంలో రెండు సార్లు ఆదరించిన పాలకుర్తి ప్రజలు ఎన్నికల్లో మరోసారి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అండగా నిలవాలని ఆయన సతీమణి ఉషా దయాకర్ రావు కోరారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మైలారం, వావిలాల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేయాలని ఓట్లు అభ్యర్థించారు. ఎర్రబెల్లి నిత్యం ప్రజా క్షేతంలో ఉంటూ సమస్యల పరిష్కారానికి శ్రమిస్తారని, రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. మహాకూటమి పేరుతో మోసం చేసేందుకు వస్తున్న నాయకులకు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎర్రబెల్లిపాలకుర్తిని ఆధర్శంగా తీర్చిదిద్దుతున్నారని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. ప్రభుత్వ పథకాలు నియోజకవర్గంలో ఇంటింటికీ చేరాయని, ప్రతి ఒక్కరు ఎర్రబెల్లి గెలుపును బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేదే ఎర్రబెల్లి మాత్రమేనన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

usha dayakarrao 1     usha dayakarrao 2     usha dayakarrao 3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *