పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు సుడిగాలి పర్యటన – రైతులకు పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణి

పాలకుర్తి శాసనసభా నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకరరావు నియోజకవర్గంలో శనివారం నాడు  సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, పెట్టుబడి సహాయ చెక్కులను అందజేశారు. అలాగే వివిధ గ్రామాల్లో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆయన సతీమణి సైతం వివాహ వేడుకలకు హాజరై వధూవరులకు నూతన వస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు. పట్టాదారు పాసుపుస్తకాలు పెట్టుబడి సహాయం అందించేందుకు వివిధ గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలు ఘనస్వాగతం పలికారు . మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండలం గుర్తూరు గ్రామంలో రైతు బంధు పథకం కింద పాసు పుస్తకాలను, చెక్కులను ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. తొర్రూర్ మండలం చింతలపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రైతుబంధు కార్యక్రమంలో లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాలను, చెక్కులను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు అందజేశారు. మహబూబాద్ జిల్లా పెద్ద వంగర గ్రామంలో అక్కడి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రైతులకు పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేశారు. అలాగే జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామాపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన రైతుబంధు కార్యక్రమంలో లబ్ధిదారులకు చెక్కులను, పాసు పుస్తకాలను శాసనసభ్యులు దయాకరరావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందజేయడమే కాకుండా పాసుపుస్తకాలతో పాటు ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుందని అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్ పహాడ్ గ్రామం లో రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు అందజేశారు .జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్ల పల్లి గ్రామంలో చెక్కులు పాసుపుస్తకాలు అందజేసిన అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు దాసోజు శ్రీకాంతచారి అని గుర్తు చేశారు. పాలకుర్తి మండలం  మంచుప్పుల గ్రామం లో రైతుబంధు కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు చెక్కులు పాసుపుస్తకాలు అందజేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పడమటి తండాలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పురోగతిని పాలకుర్తి శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్రావు సతీమణి దయాకర్ రావు పరిశీలించారు. పాలకుర్తి మండలం కొండాపూర్ గ్రామం లో ఎర్రబెల్లి దయాకరరావు చెక్కులు ,పాస్ పుస్తకాలు అందజేశారు .వరంగల్ రూరల్ జిల్లా  పర్వతగిరి మండలకేంద్రంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు రైతు బంధు పథకం ద్వారా తనకు ప్రభుత్వం నుంచి వచ్చిన 51 400 రూపాయల చెక్కును వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ నిధికి తిరిగి అప్పగించారు. అంటే చెక్కులను వాపసు ఇచ్చారు. రాయపర్తి మండలం బోరాన్ పల్లి గ్రామంలో పాసు పుస్తకాలు చెక్కులను దయాకర్ రావు రైతులకు అందజేశారు . గన్నారం గ్రామం లో ఏర్పాటుచేసిన రైతు బంద్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరబ్రెల్లి దయాకర్రావు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతు బందు కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావుకు రైతులు, ప్రజలు ,టిఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

 

WhatsApp Image 2018-05-12 at 13.00.21WhatsApp Image 2018-05-12 at 08.30.58WhatsApp Image 2018-05-12 at 08.25.23WhatsApp Image 2018-05-12 at 09.42.58WhatsApp Image 2018-05-12 at 09.43.05WhatsApp Image 2018-05-12 at 11.20.44WhatsApp Image 2018-05-12 at 11.21.02WhatsApp Image 2018-05-12 at 14.28.52

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *