పాలకుర్తి అభివృద్ధిలో భాగస్వాములుకండి

పాలకుర్తి అభివృద్ధిలో భాగస్వాములుకండి

– ఎర్రబెల్లి సతీమణి ఉషా దయాకర్ రావు
– రాయపర్తి మండలంలో ఇంటింటి ప్రచారం
ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పాలకుర్తి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు, మురిపిరాల, గన్నారం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎర్రబెల్లి పాలకుర్తి అభివృద్ధికి నిరంతరం పని చేస్తున్నారన్నారు. గతంలో రెండుసార్లు ఆదరించిన పాలకుర్తి ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని, పాలకుర్తి రుణం తీర్చుకునేందుకు కట్టుబడి పని చేస్తారని తెలిపారు. రాష్ర్టంలోనే పాలకుర్తిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎర్రబెల్లి కృషి చేస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. తండాలను పంచాయతీలుగా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కాంగ్రెస్ పాలనలో తండాలు అభివృద్ధికి నోచుకోలేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులు, గిరిజన సంప్రదాయాలకు పెద్దపీట వేసిందన్నారు. గిరిజనుల పండుగలకు ప్ర్తత్యేక గుర్తింపును తెచ్చిందన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతోనే అభివృద్ధి వేగవంతం అవుతుందని, కేసీఆర్ కొత్త పంచాయతీలు ఏర్పాటు చేశారన్నారు. టీఆర్ఎస్ తోనే గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, మరోసారి టీఆర్ఎస్ ను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ushadayakar rao 1     ushadayakar rao 2     ushadayakar rao 3     ushadayakar rao 4

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *