
పాలకుర్తిలో కాంగ్రెస్ ఖతమ్
– టీఆర్ఎస్ లోకి పెరుగుతున్న వలసలు
– ఎర్రబెల్లికి మద్దతుగా కదులుతున్న పల్లెలు
– భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సమాయత్తం
– అభివృద్ధి,సంక్షేమంతోనే చేరికలు
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకు మద్దతుగా ఊళ్లకుఊళ్లు మద్దతు తెలుపుతున్నాయి. నాలుగేళ్లుగా నియోజకవర్గంలో ఎర్రబెల్లి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు లభిస్తున్న ప్రజాదరణను చూసి అన్ని గ్రామాలు టీఆర్ఎస్ వైపే అడుగులు వేస్తున్నాయి. కొత్తపంచాయతీల ఏర్పాపటుతో దశాబ్ధాల కల నెరవేరిందని తండాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. టీఆర్ఎస్ లోకి రోజురోజుకి పెరుగుతున్న వలసలను చూసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పార్టీలో చేరుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇస్తున్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు చేసేందేమీ లేదని, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని పేర్కొంటున్నారు.
ఎర్రబెల్లికి మద్దతుగా కదులుతున్న ఊళ్లు
ఎర్రబెల్లికి మద్దతుగా పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి, పెదవంగర, తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి, దేవరుప్పల మండలాల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. నెల రోజులుగా నియోజకవర్గంలోని కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాలు, ఇతర పార్టీలు, కులసంఘాల నుంచి వలసలు పెరుగుతున్నాయి. పాలకుర్తి మండలం గోపాలపురం గ్రామస్థలు, ఎల్లరాయని గ్రామస్థలు, తొర్రూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ రాష్ట సమితి నాయకురాలు పులి ఎలేంద్ర అద్వర్యంలో 20 మంది టీఆర్ఎస్ లో చేరారు. చెన్నూరు గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది అంబేద్కర్ యువసేన యూత్ సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన పూసల కులస్థులు, కోలాట బృందాలు, 80 మంది మహిళలు గులాబీ కండువా కప్పుకున్నారు. గుంటిపల్లి యాదలక్ష్మి, గుంటిపల్లి కృష్ణవేణి, సరోజన, అలివేలు, అనిత, సరిత, రేఖ, మౌనిక, లక్ష్మి, స్వరూప, ప్రత్యూష, పార్వతమ్మ, రేణుక, మంజుల, రజిత, మౌనిక, లావణ్య, తదితరులు ఉన్నారు. పాలకుర్తి మండలం మంచుప్పుల శివారు గుడికుంట తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన కార్యకర్తలు బానోతు చందు, గుగులోత్ సుంధీకర్, ధరావత్ దేవేందర్ చేరారు. బడికుంట తండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు, బానోతు యాకుబ్, బోజ్య ఆధ్వర్యంలో 30 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దర్ధేపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువత,యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 60 మంది గులాబీ గూటికి చేరారు. పాలకుర్తి మండల కేంద్రనికి చెందిన, మాజీ సర్పంచ్ కమ్మగాని ఆంజనేయులు గౌడ్, బచ్చు సోమేశ్వర్ రావు టీఆర్ఎస్ లో చేరారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన దేవగిరి రామన్న శర్మ టీఆర్ఎస్ లో చేరారు. చెన్నూరు గ్రామంలోని మసీద్ ఇమామ్ లు ఎండీ ఫజల్,యాకూబ్, పాషా,ఖాజా,నజర్ ఎండీ యాకూబ్ లతో పాటు ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడు జిట్టబోయిన వెంకన్న తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. కోతులబాధ గ్రామం, కాశిగూడెంకు చెందిన కాంగ్రెస్ పార్టీ 60 మైనారిటీ కుటుంబాలు పాలకుర్తి పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరాయి. కొండాపురం గ్రామ శివారు మేకలతండా కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లకావత్ కాల్ రామ్, చెన్నూరు గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 80 మంది విశ్వకర్మ పరపతి సంఘం సభ్యులు చేరారు. పాలకుర్తి పట్టణ కేంద్రం నుంచి టీడీపీ పట్టణ సీనియర్ నాయకుడు కారు పోతుల కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో 40 కుటుంబాలు హనుమకొండలోని ఎర్రబెల్లి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నాయి. నర్సింగాపురం గ్రామం నుంచి 40 కుటుంబాలు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరాయి.
రాయపర్తి మండలంలో..
రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన విశ్వకర్మ సంఘంలోని 15 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. బంధన్ పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీటీకి 20 మంది, మహబూబ్ నగర్ గ్రామానికి చెందిన 30 మంది ఎర్రబెల్లి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పన్యానాయక్ తండా నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెందిన 10 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొండూరు గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి పురుషోత్తంతో పాటు 10 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. కొలాన్ పల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన తోట శశికుమార్, వెంకట్రామ్ నర్సయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరుమలాయపల్లి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 50 మంది కార్యకర్తలు రాయపర్తి మండల అధ్యక్షుడు అనిమిరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. కిష్టాపురం గ్రామం, పోతిరెడ్డిపల్లి, వాంకుడోతుతండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కారెక్కారు. కాట్రపల్లి గ్రామం నుంచి 10 విశ్వబ్రాహ్మణ సంఘం కుటుంబాలు, యువకులు, గ్రామ పార్టీ అధ్యక్షుడు వేముల రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20 మంది టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. గణేష్ కుంట తండా నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నరసింహ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కు చెందిన 20 మంది ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర్ర సమితిలో చేరారు. రాయపర్తి మండలం నూతన గ్రామ పంచాయతీ గణేష్ కుంట తండా నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో దాదాపు 40 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాయపర్తి మండలం నూతన గ్రామ పంచాయతీ గణేష్ కుంట తండా నుంచి 40 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
తొర్రూర్ మండలంలో…
తొర్రూర్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అబ్బనాపురం బ్రమ్మయ్య, బేతు హరీష్, రాపాక రాణి, లక్ష్మీతోపాటు 15 మంది, బసనబోయిన మురళి ఆధ్వర్యంలో తొర్రూర్ పాల కేంద్రానికి చెందిన 95 మంది యాదవ యూత్ సభ్యులు, టీక్యా తండాకు చెందిన 25 మంది, భోజ్య తండాకు చెందిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. సోమారం గ్రామం నుంచి మాజీ సర్పంచ్ మేడి కళావతి సోమారం గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గ్రామ పార్టీ అధ్యక్షుడు పానుగంటి మనోహర్ , గౌడ సంఘం అధ్యక్షుడు సోమలింగం గౌడ్ ఆధ్వర్యంలో 20మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. తొర్రూర్ మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్, సీపీఐ నాయకులు బురుగు వెంకన్న పాపయ్య పిచ్చయ్య రాములు మార్క ఎల్లయ్య లక్ష్మయ్య గట్టు శ్రీను నవీన్ గులాబీ కండువాలు కప్పుకున్నారు. ఏబీవీపీ తొర్రూర్ పట్టణ కన్వినర్ నగరబోయిన రాజుతో పాటు పది మంది ఏబీవీపీ నాయకులు పాలకుర్తి నియోజకవర్గం టీఆర్ఎస్వీ కో-ఆర్డినేటర్ మేడారపు సుధాకర్ ఆధర్యంలో టీఆర్ఎస్వీలో చేరారు.
దేవరుప్పుల మండలంలో..
దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామానికి చెందిన 80 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సయ్య, స్వామి, రాజు, పెద్ద కుమార్, సత్తయ్య, రమేష్, శ్రీను, కుమార్, చంద్రయ్య, తదితరులు ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దేవరుప్పుల మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు లాజర్, ఉపాధ్యక్షుడు బర్నాబాస్, కార్యదర్శి శ్రీనివాస్, లింగారావు, జాన్ పాల్, డేవిడ్ తోపాటు మరో 20 మంది పాలకుర్తిలో ఎర్రబెల్లిని కలిసి మద్దతు ప్రకటించారు. కోలుకొండ గ్రామంలో మల్లేష్ , పాషా, మల్లేష్,రవి,ఒల్లపు నారాయణ సహా 20 మంది కారెక్కారు. మండలంలోని నూతన గ్రామపంచాయతీ పొట్టి గుట్ట తండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు అజ్మీర తారాసింగ్, బద్రు, వీరన్న బాలాజీ, బానోతు హరిలాల్ తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. పెద్దమడూర్ గ్రామం నుంచి పానుగంటి గిరి,కృష్ణ ఆధ్వర్యంలో 30 మంది కాంగ్రెస్ పార్టీ యువత యునిగే శోభన్, గనుపాక కరుణాకర్, మునిగొండ వెంకటేష్, పల్లపు మధు, చెరుకు నరసింహ తదితరులు టీఆర్ఎస్ లో చేరారు. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు చింత నిఖిల్, జె.కిషన్‌తో పాటు 15 మంది టీఆర్ఎస్ లో చేరారు. సీతారాంపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ లో ఎర్రబెల్లి సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వరికాల రతన్ బాబు, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కాంటారి భాస్కర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు అంగడి రాజు, ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు కురుకుల ఉప్పటయ్య, వరికాల కృష్ణమూర్తి, వరికాల మనోహర్, బసవ రాంచంద్రు, ముర్రల ఆనంద్ తో పాటు పది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. దేవరుప్పుల మండల కేంద్రంతో పాటు, రాంచంద్రాపురం గ్రామానికి చెందిన గొల్ల,కురుమ యువజన సంఘం సభ్యులు టీఆర్ఎస్ లో చేరారు.
కొడకండ్ల మండలంలో..
కొడకండ్ల మండలం మొండ్రాయి, బండి తండా నుంచి పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు సర్పంచ్ గేపాటి నర్సయ్య యాదగిరి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు. రామన్నగూడెం గ్రామం నుంచి అందె యాకయ్య, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన యూత్ సభ్యులు 20 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. లక్ష్మక్కపల్లి గ్రామం, పెద్ద బాయి తండా నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది, గిర్నితండా గ్రామ పంచాయతీ నుంచి గిరిజన సంక్షేమ శాఖ చైర్మన్ గాంధీ నాయక్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. లక్ష్మక్కపల్లి గ్రామ శివారు లాలుజోగ్యతండాకు చెందిన గ్రామ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహెష్ తో పాటు మరో పది మంది విద్యావంతులు కారెక్కారు. రామన్నగూడెం శివారు బోడోనికుంట తండా, గిర్నీ తండాకు చెందిన 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు.
పెద్దవంగర మండలంలో..
పెద్దవంగర మండలం చిన్న వంగర గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన 120 మంది యాదవ కులస్థులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన సీనియర్ కార్యకర్తలు సుంకరి నాగరాజు, సుంకరి కృష్ణ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. గంట్లకుంట గ్రామం, రామోజీ తండా నుంచి సుమన్, గణేష్, వెంకటేష్, శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీనీ వీడి టీఆర్ఎస్ లో చేరారు. మండలంలోని కుమ్మరి సంఘం అధ్యక్షుడు పి.రమేష్, ప్రధాన కార్యదర్శి మురళీ,రంగయ్య,రామారపు రాజు, యల్.బి తండా నుంచి జె.శ్రీనివాస్, డి.సురేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు.
(అఫీషియల్ ప్రెస్ సౌజన్యంతో)