
-తాజా మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు
ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించాలని, పాలకుర్తిని ఆధర్శంగా తీర్చిదిద్దుతానని తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రంగాపురం గ్రామం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళ హారతులు, కోలాటం ఆటపాటలు, డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోళ్లతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాలకుర్తిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. గోదావరి జలాలతో చెరువులు నింపుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీసీసీ చైర్ పర్సన్ గాంధీనాయక్, జడ్పీటీసీ లలిత ప్రేమకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.