
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పార్లమెంటు మొత్తం పొగలు, అగ్నితో అలుముకుంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పొగ కమ్ముకుంది. పార్లమెంటుకు సమీపంలోని పవర్ స్టేషన్ లో ఏసీ ప్లాంట్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు హుటాహుటిన ఫైరింజన్లు రంగంలో కి దిగి మంటలు అదుపు చేశాయి.