పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

న్యూఢిల్లీ, ప్రతినిధి : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగంతో ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశాలు వాడివేడిగా జరుగనున్నాయి. గత పార్లమెంటు సమావేశాల్లో ఆర్డినెన్స్ లపై ప్రభుత్వంపై రాష్ట్రపతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటి స్థానంలో బిల్లులు ప్రవేశ పెట్టాల్సి ఉంది. మత మార్పిడిలు సహా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు సర్వం సిద్దంగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి చర్చలు జరిపారు. రాజ్యసభలో తమ బిల్లులను పాస్ చేయించాడని సహకరించాలని కోరారు. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 23 నుంచి మే 8 వరకు జరుగనున్నాయి. తొలి విడతగా 23 నుంచి మార్చి 20 వరకు.. నెల రోజుల విరామం తర్వాత ఏప్రిల్ 20 నుంచి మే 8 వరకు కొనసాగుతాయి. ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *