Breaking News

పార్లమెంటులో ‘భూసేకరణ’ మంటలు

budjet

న్యూఢిల్లీ, ప్రతినిధి : రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే భూ సేకరణ అంశం పై పార్లమెంటు దద్దరిల్లింది. సమావేశాలు ప్రారంభంకాగానే ప్రతిపక్షాలు ఈ బిల్లుపై చర్చ జరపాలని పట్టుబట్టాయి. ఈ ఆర్డినెన్స్ ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు 636 ఆర్డినెన్స్ లు వచ్చాయని.. అందులో 80 శాతం కాంగ్రెస్ పార్టీ జారీ చేసినవేనని గుర్తు చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఆర్డినెన్స్ జారీ చేశారని మండిపడ్డారు. భూసేకరణ వల్ల రైతులకు ఎంతో నష్టం జరుగుతుందని జేడీయూ నేత శరద్ యాదవ్ అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *