పారిస్ లో మళ్లీ కాల్పులు!

పారిస్ లోని చార్లీ హెబ్టో అనే వీక్లీ మ్యాగజైన్ సంస్థ ఆఫీస్ పై జరిగిన కాల్పుల ఘటన మరవక ముందే సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. హై అలెర్ట్ ఉన్నా దుండగులు రెచ్చిపోయారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి మెట్రోంగ్ ప్రాంతంలో ఆటోమేటిక్ రైఫిల్ తో పోలీసులపై కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో మహిళా పోలీస్ చనిపోగా, ఓ పోలీస్ ఆఫీసర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 24 గంటల్లోనే రెండు సార్లు కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.