పారిస్ లో కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన మోడీ

పారిస్ : ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోడీ తమ కంటే ముందు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అవినీతిని కడిగి పారేశారు. గతరాత్రి ప్రవాస భారతీయులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశానికి లక్షల కోట్ల ఆదాయ వనరులను సమకూర్చే బొగ్గు బ్లాకుల కేటాయింపులో కాంగ్రెస్ అడ్గగోలుగా వ్యవహరించిందని మండిపడ్డారు. పెన్నులు, కర్చీలు ఇచ్చినంత తేలిగ్గా వాటిని ఇచ్చేసిందని.. ఫలితంగా లక్షల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని దుయ్య బట్టారు.

చివరకు ఈ లక్షల కోట్ల కుంభకోణాన్ని సుప్రీం కోర్టు గుర్తించి రద్దు చేసిందని.. ఈ కుంభకోణంలో మాజీ ప్రధానికి కూడా ‘మసి’ అంటిందని ధ్వజమెత్తారు. యూపీఏ 204 బొగ్గు బ్లాకుల్లో కేవలం 20 బ్లాకులను వేలం వేస్తే 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. భారత్ బీజేపీ ప్రభుత్వంలో అభివృద్ది చెందిన దేశంగా మారుతుందని పునరుద్ఘాటించారు. వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటి సంస్థలు భారత్ ను అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తించిందని పేర్కొన్నారు.

gmodi

అనంతరం మోడీ జర్ననీ పర్యటనకు బయలుదేరారు. అక్కడి హనోవర్ కు చేరుకోగానే భారతీయులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం హనోవర్ లో  ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *