పారిశ్రామిక హబ్‌ గా సిద్ధిపేట

గజ్వేల్ లో ప్లాస్టిక్, హౌసరీ క్లస్టర్స్.

హుస్నాబాద్, ముండ్రాయి, మందపల్లిలో రైస్ మిల్లర్స్.

జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, హౌసరీ, రైస్ మిల్స్ యూనిట్లు.

జిల్లాలో 10చోట్ల పరిశ్రమల స్థాపన.

పారిశ్రామిక అభివృద్ధి వికేంద్రీకరణ.
—————————-
సిద్ధిపేట జిల్లా ఇక పారిశ్రామిక హబ్‌గా రూపాంతరం చెందనున్నది. పారిశ్రామిక అభివృద్ధిపై సమగ్ర విధానం అమలు చేస్తామని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
పారిశ్రామికాభివృద్ధిని జిల్లాలోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా వికేంద్రీకరణ జరుగుతుందన్నారు.
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం  పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.   ఇండస్ట్రీయల్ క్లస్టర్స్ ఏర్పాటుపై సమీక్ష జరిపారు.
వివిధ శాఖల అధికారుల సమన్వయంతో
సుదీర్ఘంగా చర్చించి పరిశ్రమల ఏర్పాటుకు వీలు కల్పిస్తామని కలెక్టర్ వెంకట రామిరెడ్డి తెలిపారు.ఇప్పటికే కొన్ని పరిశ్రమల ఏర్పాటుకు  సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి అయ్యిందని ఆయన చెప్పారు. రెండేళ్లలో సిద్ధిపేట జిల్లా మీదుగా జాతీయ రహదారి, రైల్వే రానున్న క్రమంలో ఏలాంటి ఇబ్బందులు ఉండవని, సిద్ధిపేట జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడాలని, ప్రభుత్వం తరపున, జిల్లా యంత్రాంగం తరపున పూర్తి సహకారం, కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తామని పరిశ్రమ స్థాపక ప్రతినిధులకు మంత్రి హరీశ్ రావు భరోసా ఇచ్చారు.అభివృద్ధి ఒకవైపే కేంద్రీకృతం కాకుండా చూస్తున్నట్టు చెప్పారు.  సిద్ధిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. హుస్నాబాద్, ముండ్రాయి, మందపల్లిలో రైస్ మిల్లర్స్, అలాగే జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్, హౌసరీ, రైస్ మిల్స్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నామని వివరించారు. మొత్తం జిల్లాలో 10చోట్ల పరిశ్రమల స్థాపనలు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.  సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం ముండ్రాయి, చిన్నకోడూర్ మందపల్లిలో po270 ఎకరాల స్థలంలో ప్లాస్టిక్ హౌసరీ, రైస్ మిల్లింగ్, చిన్నకోడూర్ మండలం జక్కాపూర్ లో 100 ఎకరాల స్థలంలో ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు, కొమురవెళ్ళి మండలం ఐనాపూర్, తపాస్ పల్లిలో 1300 ఎకరాలలో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ పరిశ్రమ ఏర్పాటు, జగదేవ్ పూర్ మండలంలోని పీర్లపల్లిలో 200 ఎకరాలు ప్లాస్టిక్ క్లస్టర్, రెడీమేడ్ గార్మెంట్స్-హౌసరీ, జగదేవ్ పూర్ మండలంలోని మునిగడపలో 412 ఎకరాలలో ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, హుస్నాబాద్ మండలంలోని జాలిగడ్డలో 100 ఎకరాలలో రైస్ మిల్లు, మండల కేంద్రమైన కొండపాకలో 41 ఎకరాలలో రెడీమేడ్ గార్మెంట్స్-హౌసరీ, ములుగు మండలంలోని కొత్యాల్ లో 102 ఎకరాలలో రెడీమేడ్ గార్మెంట్స్-హౌసరీ ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు చెప్పారు.సమావేశంలోఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, టీ.ఎస్ఐ.ఐ.సీ ఏం.డీ నర్సింహ్మారెడ్డి, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి,సిద్ధిపేట డీఆర్వో చంద్రశేఖర్, జిల్లా డీఐసీ జీఎం నవీన్ కుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్‌ మాధవి, టీఐఎఫ్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, లీడ్ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *