పారదర్శకపాలనే లక్ష్యం

పారదర్శకపాలనే లక్ష్యం

-పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు
టీఆర్ఎస్ తోనే పారదర్శక పాలన అందుతుందని పాలకుర్తి టీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూర్ గ్రామంలోని కాంగ్రెస్ కు చెందిన ఐదు కుటుంబాలు టీఆర్ఎస్ లో చేరాయి. ఈ సందర్భంగా ఎర్రబెల్లి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ప్రవేశ పెడుతున్నారని, ప్రతీ ఒక్కరు టీఆర్ఎస్ కే ఓటు వేయాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో ఆవుల మధుసూదన్, శ్రీనివాస్, ముత్యాల సారయ్య తదితరులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *