పాపం .. రోజా

ఇప్పుడు ఎమ్మెల్యే రోజాను పాపం అనకుండా ఎవరూ ఉండలేరు. ఏపీ ప్రభుత్వంపై , చంద్రబాబుపై నోరుజారిన ఆమెను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వడం లేదు చంద్రబాబు..  సాక్షాత్తూ రాష్ట్ర హైకోర్టు ఆమెపై ఏపీ శాసనసభ చేసిన సస్పెన్షన్ రద్దు చేసి అసెంబ్లీలోకి పోవడానికి అనుమతిచ్చినా కూడా ఏపీ శాసనసభ స్పీకర్ , చంద్రబాబు ప్రభుత్వం లోపలికి అనుమతించకపోవడంతో ఆమె రోదన అరణ్యరోదనే అవుతోంది. నిన్న ఆమెను అసెంబ్లీలోకి అనుమతించాలని ప్రతిపక్ష నేత జగన్ సహా ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీ బయట ధర్నా నిరసన తెలిపినా కూడా అధికార పక్షం రోజాను లోపలికి అనుమతించక కక్షపూరితంగా వ్యవహరించింది.

అధికార అండదండలతో మార్షల్స్ ను పెట్టి ఆమెను అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వలేదు.. దీంతో ఈరోజు నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు.రోజా చంద్రబాబుపై నోరు జారి ఏడాది అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. హైకోర్టుకు వెళ్లి ఆమె సస్పెన్షన్ ను రద్దుచేసుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కానీ అధికార టీడీపీ ఆమెకు చుక్కలు చూపిస్తోంది. ప్రతిపక్ష జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా ఆమెకు అండగా నిలిచి ఆందోళన చేస్తున్నా కూడా స్పీకర్, చంద్రబాబు స్పందించకపోవడం దారుణమని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. అధికార బలంతో వ్యవహరిస్తున్నారని.. అన్ని రోజులు ఒకలా ఉండవని జగన్ విమర్శించారు. రోజాపై ఏపీ శాసనసభ కార్యదర్శి హైకోర్టులో మరో దావా వేశారు. రోజా సస్పెన్షన్ న్యాయమని.. వేరే సెక్షన్ల కింద ఆమెను సస్పెండ్ చేసినట్లు వివరించారు. సోమవారం విచారణకు వచ్చే ఈ పిటీషన్ లో ఒకవేళ రోజాకు వ్యతిరేకంగా వస్తే మళ్లీ ఏడాది పాటు ఆమె సస్పెన్షన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *