Breaking News

పాపం పసివాడు..

Five-month-old-2610

-కాంట్రాక్టర్ పాలు ఇచ్చేందుకు పంపకపోవడంతో మృత్యువాత పడిన బాలుడు

మెదక్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఆగడానికి ఓ పసిబిడ్డ ప్రాణం పోయింది. తన దగ్గరి పనికి వచ్చిన ఓ బాలింతను బిడ్డకు పాలు ఇచ్చేందుకు వెళ్లనీయకపోవడంతో ఆ పసిగుడ్డు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి చనిపోయిన హృదయ విదారక సంఘటన మెదక్ జిల్లా కాకర్లపాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

మహబూబ్ నగర్ కు చెందిన కూలీలు కొందరు మెదక్ జిల్లా హత్నూర మండలం మల్కాపూర్ సమీపంలోని ఓ పరిశ్రమ విస్తరణ పనుల్లో ఓ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు. కూలీల్లో మల్లేశ్వరి అనే మహిళ కూడా పనిచేస్తోంది. ఈమెకు ఆరు నెలల బాబు ఉన్నాడు. గత శనివారం మల్లేశ్వరి పనికి వెళ్తూ బాబును కుమార్తెలకు అప్పగించింది. కొంత సేపటికీ శిశువు పాల కోసం గుక్కపెట్టి ఏడ్వడం మొదలుపెట్టాడు. కానీ కాంట్రాక్టర్ పని నుంచి వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో బాలుడు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. రెండు గంటల తర్వాత మల్లీశ్వరీ వచ్చి చూసేసరికి చనిపోయి ఉన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ తనపై విమర్శలు రాకుండా వారిని బెదిరించి శిశువు మృతదేహాన్ని నర్సాపూర్ తరలించి అంతిమసంస్కరాలు చేసినట్లు తెలిసింది. శిశువు మృత దేహానికి కారణమైన కాంట్రాక్టర్ అమానవీయ చర్యను అందరూ ఖండిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *