పాపం చంద్రాలు..

kcr tdp

చంద్రబాబు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది. ఏపీలో ఉద్యమాలు.. తెలంగాణలో  నాయకులు టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీ కుదేలవడంతో దిక్కుతోచడం లేదు..  పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  దెబ్బకు టీడీపీ కుదేలయ్యింది..  కాంగ్రెస్ లో కుప్పలు తెప్పల రాజకీయంతో పాము చావదు అని తెలుసు కనుకే ఆ పార్టీని లైట్ తీసుకొని బలమైన పునాదులున్న టీడీపీని నాశనం చేయడానికి తెలంగాణలో ఎన్ని చేయాలో అన్ని చేశారు. వచ్చిన ప్రతీ ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధులకు కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు.. అందుకే గ్రేటర్ లో, వరంగల్ లో టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది.

ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి తప్ప టీడీపీకి బలమైన నేత లేకుండా పోయారు. రేవంత్ కూడ కుర్ర చేష్టలతో టీడీపీలో బలమైన నేత అన్న భావన ఆ పార్టీలో లేదు. తెలంగాణలో బలమైన నేత అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. ప్రస్తుతం టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఉంటూ టీఆర్ఎస్ లో చేరడంతో ఇక టీడీపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్టు అయ్యింది.. మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ బాట పట్టారు. వచ్చే 2019 ఎన్నికల్లో పు టీడీపీ గెలిచే అవకాశాలు లేవు. దీంతో తమ నియోజకవర్గాల అభివృద్ది, తమ భవిష్యత్తు దృష్టానా టీఆర్ఎస్ లో చేరినట్టు పార్టీ మారిన నేతలు చెబుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ వ్యూహానికి తెలంగాణలో టీడీపీ కుదేలయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *