పాత మిత్రులు పనిమీద కలిశారు..

05-1430810723-kadiam-babu-654

హైదరాబాద్ : వారిద్దరు చాలాకాలం టీడీపీ తరఫునే పనిచేశారు. ఒకరు సీఎం చంద్రబాబు, మరొకరు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. ఇద్దరు టీడీపీలో ఉద్దండులే.. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత 30 ఏళ్ల బంధం తెంచుకొని కడియం టీఆర్ఎస్ లోని పాత టీడీపీ మిత్రుడు కేసీఆర్ పంచన చేరాడు. పదవి పొందాడు..

కాగా మంగళవారం కడియం శ్రీహరి, చంద్రబాబును కలిసి సమస్యలపై చర్చించారు. వరంగల్ లోని రేయాన్స్ కంపెనీని పునప్రారంభించేందకు సహకరించాలని చంద్రబాబును కోరారు. ఆంధ్రాలో ఉన్న ముడిసరుకును 50శాతం సబ్సిడీపై కంపెనీకి అందించాలని కడియం విన్నవించారు. కాగా ఆర్థిక సమస్యలు ఉన్నందుకు అందిరితో మాట్లాడి చెబుతానని చంద్రబాబు సమాధానమిచ్చారు.

వరంగల్ సమస్య మొత్తానికి పాత మిత్రులను మళ్లీ కలిసేలా చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *