పాత్రికేయ పితామ‌హుడు తాపీ ధ‌ర్మారావు: అబ్కారీ డిప్యూటీ క‌మీష‌న‌ర్ చైత‌న్య ముర‌ళి

విజ‌య‌న‌గ‌రం :  తెలుగు ప‌త్రికారంగంలో  చెర‌గ‌ని ముద్ర‌వేసి ర‌చ‌యిత‌, పాత్రికేయుడు, వ్య‌వ‌హారిక భాషా ఉద్య‌మ‌నేత తాపీ ధ‌ర్మారావు పాత్రికేయ పితామ‌హునిగా పేరుగాంచార‌ని అబ్కారీ డిప్యూటీ క‌మీష‌న‌ర్ చైత‌న్య ముర‌ళి కీర్తించారు. తాపీ ధ‌ర్మారావు 128వ జ‌యంతి సంద‌ర్భంగా శ‌నివారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ యూనియ‌న్ ఆఫ్ వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్స్ (ఎపీయూడ‌బ్ల్యూజే), ప్రెస్‌క్ల‌బ్ ఆధ్వ‌ర్యాన జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ముఖ్యఅతిధిగా పాల్గొని ప్ర‌సంగించారు. నార్ల వెంక‌టేశ్వ‌ర‌రావు, కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు వంటి ఉద్ధండులు ఆయ‌న వ‌ద్ద ఉప‌సంపాద‌కులుగా ప‌నిచేసి ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నార‌ని గుర్తుచేశారు. ఆంధ్ర‌ప్ర‌భ‌, ఆంధ్ర‌జ్యోతి వంటి ప‌త్రిక‌లేగాక జ‌న‌వాణి వంటి దేశ‌భ‌క్తి ప్ర‌భోద ప‌త్రిక‌ల‌కు ఆయ‌న సంపాదకులుగా వ్య‌వ‌హ‌రించార‌ని, బోయి భీమ‌న్న‌కు జాన‌ప‌దుడ‌ని బిరుదునిచ్చి ప్రోత్స‌హించార‌ని వివ‌రించారు. విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా వ్యావహారిక భాషా ఉద్య‌మాన్ని న‌డిపిన తాపీ ధ‌ర్మారావు విశాలాంధ్ర ప‌త్రిక‌కు పేరుపెట్టార‌ని చెప్పారు. దేవాల‌యాల మీద బూతు బొమ్మ‌లెందుకు అనే ర‌చ‌న‌తో కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు అందుకున్న ఆయ‌న మూఢ‌న‌మ్మ‌కాల‌ను వ్య‌తిరేకించార‌ని, స్త్రీ విద్య‌ను ప్రోత్స‌హించార‌ని ముర‌ళీ చెప్పారు. అటువంటి వ్య‌క్తి జ‌యంతి జ‌ర‌ప‌డం పాత్రికేయ‌లోకానికి గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని అన్నారు. మాల‌పిల్ల‌, ప‌ల్లెటూరి పిల్ల వంటి చిత్రాల‌కు మాట‌లు, పాట‌లు రాశార‌ని గుర్తుచేశారు. తొలుత తాపీ ధ‌ర్మారావు చిత్ర‌ప‌ఠానికి పూల‌మాల‌లు వేసి అంజ‌లి ఘ‌టించారు. కార్య‌క్ర‌మంలో భాగంగా తాపీ ధ‌ర్మారావుపై నిర్వ‌హించిన వ్యాస‌ర‌చ‌న పోటీల్లో విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలోఎపీయూడ‌బ్ల్యూజే జిల్లాశాఖ అధ్య‌క్షుడు పి.ఎస్.ఎస్‌.వి. ప్ర‌సాద‌రావు  కార్య‌ద‌ర్శి మ‌హాపాత్రో,  ప్రెస్‌క్ల‌బ్ అధ్య‌క్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు గురుప్ర‌సాద్‌, ర‌చ‌యిత క్రొవ్విడి శార‌దాప్ర‌సాద్  త‌దిత‌రులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *