పాతబస్తీలో రెజ్లింగ్ ఫైట్, ఒకరి మృతి

హైదరాబాద్ : పాత బస్తీలో రెజ్లింగ్ ఫైట్ లో ఒకరు మృత్యువాత పడ్డారు. వరల్డ్ రెజ్లింగ్ క్రీడలను అనుసరించి ఈ ఫైట్ లు హైదరాబాద్ పాతబస్తీలో తరుచుగా జరుగుతుంటాయి. ఈ క్రీడల్లో వేలల్లో పందెంలు కాసి గెలిచిన వారు సొంతం చేసుకుంటారు. కాగా ఇదే ఆట ఓ యువకుడి ప్రాణాలను తీసింది. నబీల్ అనే యువకుడు, మరో యువకుడు ఈ రెజ్లింగ్ పోటీని పాతబస్తీలోని ఓ వీధిలో నిర్వహించారు. ఈ ఆటలో తీవ్రంగా పిడిగిద్దులు గుద్దుకున్న ఇద్దరిలో నబీల్ కు తీవ్రగాయాలై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *