
కరీంనగర్ (పిఎఫ్ ప్రతినిధి): రాష్ర్టంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్రంపై ఒత్తడి తెచ్చి రూ. 450 కోట్ల రుణాన్ని మంజూరు చేయించడం జరిగిందని ఎంపి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే కరీంనగర్ జిల్లాకు రూ. 50 కోట్లు మంజూరు కానున్నాయని తెలిపారు. నాబార్డు వారి సహాయంతో కెడిసిసి బ్యాంకు వారి ఆధ్వర్యంలో ప్రాంతీయ అభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ర్టానికి మరింత ఆదాయం చేకూరుతుందని అన్నారు. జిల్లాలో వంటి మామిడి మార్కెట్ తరహా అధునాతన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం స్ర్తీ శక్తి బ్యాంకు నుంచి వెయ్యి పాడి పశువులు, గొర్రెలకు రుణాలు ఇవ్వనున్నామని, రైతులకు అనేక రూపాల్లో సహాయం అందించేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పాడి సంపదను పెంచేందుకు అన్ని విధాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆప్కాబ్ చైర్మన్ కోండూరి రవీందర్ రావు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న కెడిసిసి బ్యాంకును నేడి లాభాల్లోకి తీసుకురావడం జరిగిందని ఇందులో భాగంగానే 120 సంఘాలకు లాభాలు చేకూరాయని అన్నారు. రూ. 402 కోట్ల రుణాలను మంజూరు చేశామని, విదేశాల్లో విద్యార్థుల చదువులకు రూ.15 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి, నాబార్డ్ డీజీఎం గుప్తా, ఏజీఎం రవిబాబుతో పాటు విిధ విభాగాల అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.