పాడి పరిశ్రమకు ఊతమివ్వాలి..

కరీంనగర్ : జిల్లాలో పాడి పరిశ్రమకు ఊతమిచ్చి, తద్వారా పేద చిన్న కారు రైతులకు ఆసరా ఇవ్వాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులు , డెయిరీ ప్రతినిధులతో కలెక్టర్ పాడి పరిశ్రమపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్ డీ ఏ ద్వారా గ్రామాల్లోని పేద చిన్నకారు రైతులను గుర్తించి పాడి గేదెల కొనుగోలుకు రుణాలివ్వాలని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చి వారి ఆదుకోవాలన్నారు.

01

ఒక గేదె కు 40వ వేల చొప్పున రెండు గేదెల కొనుగోలుకు బ్యాంకుల ద్వారా రుణం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. లబ్దిదారులు గ్రామస్థాయిలో తీర్మానం చేసి పంపిస్తే డెయిరీ పరంగా బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్ డీ ఏ పీడీ అరుణశ్రీ, పశుసంవర్ధక శాఖ జేడీ రాంచందర్, ఎల్ డీ ఎం చౌదరి, నాబార్డు ఏజిఎం రవిబాబు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వరరావు, ముల్కనూర్ డైరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *