పాక్ పనిపట్టారు.. అజేయ భారత్ ను చేశారు.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు సత్తా చాటింది. టీట్వంటీ ప్రపంచకప్ లో దాయాది పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓడిపోతే భారత్ ఇంటికే.. ఈ క్లిష్ట సమయంలో అదీ పాకిస్తాన్ తో పోరులో ఎంతో ఒత్తిడితో బరిలోకి దిగిన టీమిండియా అద్భుతంగా పోరాడి విజయం సాధించింది. బంతి బంతికి నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్ లో ఆద్యంతం భారత్ ఆటగాళ్లు పట్టుదలగా ఆడి విజయాన్నిందారు..
కాగా భారత విజయంలో స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ దే కీలక పాత్ర.. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వేళ.. అతడు బరిలోకి దిగి 37 బంతుల్లో 55 పరుగులు చేసి ఒంటిచేత్తో భారత్ కు విజయాన్నందించాడు.. విరాట్ ఆడకపోయి ఉంటే భారత్ ఖచ్చితంగా ఓడి ఉండేది. విరాట్ కు యువరాజ్ 24, ధోని సహకారమింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత బ్యాంటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 18 ఓవర్లలో 118 పరుగులు చేసింది. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *