Breaking News

పాక్ కు 35 కి.మీ ల దూరం.. అందుకే టార్గెట్..

INDIA-ATTACK__2680424f

పఠాన్ కోట్ వైమానిక స్థావరం.. ఇది భారత్ లోని పంజాబ్ రాష్ట్రంలో పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 35 కి.మీల దూరంలో ఉన్న భారత రక్షణ రంగంలోనే అతిపెద్ద వైమానిక స్థావరం.. ఇక్కడి నుంచి పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్.., ప్రధాన పట్టణం లాహోర్ లపై ఈజీగా దాడిచేయొచ్చు. అంతేకాదు.. ఉగ్రవాదుల ఆటలు కట్టించవచ్చు. కశ్మీర్, పంజాబ్ ల వరకు ఉగ్రవాద దాడులు ఎక్కడ జరిగిన ఈ కేంద్రం నుంచి తొందరగా దాడి చేసేందుకు వీలుంటుంది.

అందుకే పాకిస్తాన్ ఐఎస్ఐ , ఉగ్రవాదులు, సైన్యం కలిసి కుట్రపన్ని ఉగ్రమూకలను పఠాన్ కోట్ పై దాడికి పంపాయి. అత్యాధునిక ఆయుధాలతో పఠాన్ కోట్ పై దాడికి పాల్పడ్డారు. ఇక్కడ భారత్ కు చెందిన అత్యాధునిక ఆయుధాలు, మందు గుండు సామగ్రి, క్షిపణులు, అత్యాధునిక ఫైటర్ విమానాలున్నాయి.. వీటన్నింటిని సర్వ నాశనం చేయడమే లక్ష్యంగా దాడికి దిగిన పాక్ ఉగ్రమూకల దాడిని సమర్థంగా తిప్పి కొట్టారు భారత సైన్యం.. 10 మంది వరకు అసువులు బాసి భారత్ అస్తిత్వాన్ని కాపాడారు..

ప్రధాని మోడీ పాకిస్తాన్ ప్రధానిని ఇంటికెళ్లి వాళ్ల మనవరాలికి పెళ్లికి హాజరై శాంతియుత వాతావరణానికి పాటుపడిన పాక్ వక్రబుద్ది మారకుండా ఇలా దాడులు చేయించడంతో పాక్ తో వైకరిలో మోడీ వైఖరి మారుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *