పాక్ కు చెక్, నిజాంల సంపద మనకే..

భారతదేశంలో నిజాం సంస్థానం విలీనంకు ముందు తరిలిపోయిన సంపద 67 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియాకే దక్కేటట్టు బ్రిటన్ లోని కోర్టు తీర్పుచెప్పింది. ఈ నిధి కోసం పాకిస్తాన్ ఇండియాల మధ్య 67 ఏళ్లకు పైగా కోర్టులో వాదన జరుగుతోంది. నిజాం వారసులు కూడా ఈ డబ్బు మాదంటూ వెనక్కి ఇచ్చేయాలంటూ పోరాడుతున్నారు. నిజాం నవాబులు పాకిస్తాన్ కు పారిపోవడంతో ఆ వాటా మాకే ఇవ్వాలంటోంది పాకిస్తాన్. ఇక భారత్ .. అది నిజాంలు ఏలిన హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల సొమ్ము అని ప్రజల కష్టారితం నుంచే ఆ సోమ్ము నిజాం వసూలు చేసి విదేశాలకు తరలించాడని వాదన వినిపించింది. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసు తీర్పును బ్రిటన్ కోర్టు నిన్న వెలువరించింది.

భారత్ కు అనుకూలంగా తీర్పువచ్చింది. పాకిస్తాన్ వైఖరిని తప్పుపట్టింది. పాకిస్తాన్ కు ఈ డబ్బుతో సంబంధం లేదని , 67 ఏళ్లుగా కేసులో పాక్ వాదన సహేతుకం కాదని ఆ దేశానికి ఫైన్ విధించింది. కోర్టు  భారత్ కు కోర్టు ఫీజుల కింద రూ.1.35 కోట్లను చెల్లించాల్సిందిగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పు తదనంతరం తరలిపోయిన రూ315 కోట్లు తిరిగి రాబట్టుకునేందుకు భారత్ కు మార్గం సుగమం అయ్యింది.తుది తీర్పులో భారత్ కు ఈ సొమ్ము చెందనుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *