పాకిస్తాన్ పై టీమిండియా ఘన విజయం

cicket

ఆసియా కప్ లో దాయాది పాకిస్తాన్ తో పోరులో టీమిండియా పైచేయి సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో మొదట బ్యాంటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాటింగ్ వైఫల్యంతో 17.3 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌటయ్యింది. భారత్ బౌలర్లు మెరుగ్గా రాణించడంతో పాకిస్తాన్ టపటపా వికెట్లు కోల్పోయింది.సర్ఫరాజ్ అహ్మద్ 25 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత్ బౌలర్ హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీసి పాక్ పతనానికి నాంది పలికాడు..

కాగా అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన భారత్ కు ముచ్చెమటలు పోయించాడు యువ పేసర్ ఆమిర్.. భారత ఓపెనర్లు రహానే, రోహిత్ లను మొదటి ఓవర్ లోనే డకౌట్ గా ఔట్ చేసి సంచలనం రేపాడు.. అనంతరం భారత్ ను కోహ్లీ 49 పరుగులు చేసి ఆదుకున్నాడు.. యువరాజ్ 14 పరుగులు చేశాడు. కోహ్లీ వల్లే భారత్ విజయం సాధించింది.. కోహ్లీకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *