Breaking News

పాకిస్తాన్ పై ఇండియా ఘనవిజయం

kohli-senturi

-కోహ్లీ సెంచరీ.. ఇండియా 300-7, పాకిస్తాన్ 224 అలౌట్
– పాకిస్తాన్ పై రాణించిన రైనా, ధావన్
అడిలైడ్ : పాకిస్తాన్ తో జరుగుతున్న వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు సాధించింది. కోహ్లీ సూపర్ సెంచరీ(107)తో కదం తొక్కడంతో భారీ పరుగులు వచ్చాయి. ఒక దశలో ఇండియా 340 పరుగులు కూడా చేస్తుందని అంచనాలు వేసినా చివర్లో కోహ్లీ, రైనా అవుటవడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 300 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో కోహ్లీతో పాటు రైనా 74 పరుగులు చక్కని సహకారం అందించారు. వీరితోపాటు ధావన్ 73, ధోని 18, రోహిత్ 15 పరుగులు చేశారు.

కాగా పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ బ్యాట్స్ మన్ పరుగులు చేయడానికి తడబడ్డారు. కోహ్లీ ఓట్ అయిన తర్వాత పరుగులు రావడమే గగనమైంది. పాకిస్తాన్ సోహైల్ ఖాన్ 5 వికెట్లు తీసి చివర్లో పరుగులను కట్టడి చేశారు.

రెండో సెషన్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ లో తడబడింది. మిస్బా ఉల్ హక్ 76 పరుగులు చేసి కడదాక నిలిచాడు. ఓపెనర్ షెజాద్ 47 పరుగులు చేశారు. బ్యాటింగ్ విఫలమైన పాకిస్తాన్ ఆటగాళ్లు 224 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ఇండియా ఘన విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు అభిమానులు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *