పాకిస్తాన్ ఇంటికి.. ఆస్ట్రేలియా ముందుకు..

సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. వరల్డ్ ట ట్వంటీ కప్ లో భాగంగా ఈరోజు జరిగిన మ్యాచ్ లో అసీస్-పాకిస్తాన్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ స్మిత్ 61 పరుగులు, మ్యాక్స్ వెల్ 30, వాట్సన్ 44 పరుగులు చేశారు.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ పోరాడిన ఫలితం దక్కలేదు..20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది.. పాక్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్ 30 , ఖలీద్ లతీఫ్ 46, ఉమర్ అక్మల్ 32 మాలిక్ 40 పరుగులు చేసినా ఆ జట్టును గెలిపించలేకపోయారు. ఈ ఓటమితో పాకిస్తాన్ ఇంటికి వెల్లినట్టై అయ్యింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు సెమీస్ చేరుతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *