
ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి మోకా మోకా ప్రకటనతో భారత క్రికెట్ మ్యాచ్ లకు ప్రాచుర్యం కల్పిస్తున్న ‘స్టార్ స్పోర్ట్’ సంస్థ మరో కొత్త ప్రకటనతో ముందుకొచ్చింది. పాకిస్తాన్ -ఇండియా క్రికెట్ మ్యాచ్ కోసం రూపొందించిన పాకిస్తాన్ అభిమాని యాడ్ కొనసాగుతూనే ఉంది.
ఇండియా ఓడిపోయాలని పాకిస్తాన్ అభిమాని ఇండియా తలపడే దేశాల జెర్సీలు వేసుకొని మ్యాచ్ చూస్తున్న వీడియోలు సందడి చేశాయి. ఇండియా ప్రతీ మ్యాచ్ గెలవడంతో పాకిస్తాన్ అభిమాని నిరాశలో కుంగిపోతాడు. కాగా ఇప్పుడు భారత్ తన తర్వాత మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలపడిబోతోంది. కాగా క్వార్టర్ సమీకరణాల నేపథ్యంలో పాకిస్తాన్ క్వార్టర్స్ చేరాలంటే ఐర్లాండ్ ఇండియామీద ఓడిపోవాలి. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ అభిమాన కాస్తా ఇండియాకు మద్దతు ఇస్తున్న వీడియో ప్రపంచకప్ లో దర్శనమిస్తోంది. టపాసులు పట్టుకుని.. ఇండియా జెర్సీతో పాకిస్తాన్ అభిమాని ఈసారి వాటిని కాల్చేందుకు సిద్ధమవుతున్నాడు.