పసికూన ఐర్లాండ్ సంచలన విజయం

-వెస్టీండీస్ ను చిత్తుగా ఓడించిన ఐర్లాండ్
ఆస్ట్రేలియా : ప్రపంచకప్ లో ఈరోజు సంచలనం నమోదైంది. తన కంటే ఎంతో మెరుగైన , బలమైన వెస్టీండీస్ జట్టును పసికూన అయిన ఐర్లాండ్ అలవోక ఓడించి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్ లో విండీస్ పై ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

వెస్టీండీస్ మొదట బ్యాటింగ్ చేసి 305/7 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. సిమన్స్ (102) సెంచరీ చేశాడు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టుకు ఆ బ్యాట్స్ మెన్ చెలరేగడంతో లక్ష్యాన్ని 45.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. పాల్ స్టిర్లింగ్(92), జోయస్ (84), ఓబ్రిన్(79) పరుగులు ఐర్లాండ్ ను గెలిపించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *