Breaking News

పవిత్ర స్నానాలాచరించిన 11.78లక్షల మంది భక్తులు:జిల్లా.ఎస్పీ.డి.జోయల్ డేవిస్..

shri.d.joel_davis_appointed_as_karimnagar_new_honble_supperendent_of_police_sp

జూలై23:జిల్లాలో పుష్కరస్నానాలు ప్రశాంతంగా కొనసాగాయి. జిల్లాలోని 22ప్రాంతాలు,36పుష్కరఘాట్లటో గురువారం నాడు 11.78 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. పుష్కరాలు జరుగుతున్న ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తును కొనసాగించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పోలిసులు సహకరించడం జరుగుతుందని తెలిపారు. పుష్కరస్నానాలకు విచ్చేసే భక్తులు పోలీసుల సూచనలు, సలహాలను పాటించాలని తెలిపారు. దారి మళ్లింపు చర్యల ద్వారా ట్రాఫిక్ నకు ఎలాంటి అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ధర్మపురిలో 5.12లక్షలు, తిమ్మాపూర్ లో1100, రాయపట్నంలో 12వేలు, కాళేశ్వరంలో 3.47లక్షలు, కోటి లింగాలలో 1.48లక్షలు, మంథనిలో 48.500లక్షలు, గోదావరిఖని బ్రిడ్జి 17800, సుందళ్ళ 13వేలు, అంతర్గాం 8వేలు, బోర్నపల్లి200, కోత్త దాంరాజ్ పల్లి 200, ఎర్దండి 7వేలు, వేములకుర్తి200, ఫకిర్ కొండాపూర్ 1350, మూల రాంపూర్ 650, యమపూర్ 1500, కమ్మూనూర్ లలోని పుష్కరఘాట్ల వద్ద 5వేల మంది పవిత్ర స్నానాలాచరించారన్నారు. భక్తులు పోలీసులు, సలహాలను పాటిస్తూ తమవంతు సహాకారం అందజేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *