పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎంతో ముఖ్యం !

ముఖ్యమంత్రి కే సి ఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను ఏవిధంగా కూడా విమర్శించడానికి వీలులేదు. సాధారణంగా అసంబ్లిలో శాసన సభ్యులందరూ ఇచ్చేది పేపర్ ప్రజెంటేషన్ .ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి చెప్పాల్సింది గూగుల్ ఎర్త్ లేదా గూగుల్ మ్యాప్ సహకారంతో క్షన్నంగా అర్థం చేపించే ప్రయత్నం చేయడం అభినందనీయమే. ఇప్పుడున్న వర్తమామాన పరిస్థితులకు తగ్గట్టుగా తనకుతాను ఆధునికరించుకొని ప్రతిదాన్ని లోతుగా పరిశీలించి, అవగాహన తెచ్చుకొని తోటి ప్రజా ప్రతినిధులకు కూడా అర్థం చేపించే తాపత్రయం చూస్తుంటే ముఖ్యమంత్రి గారి పట్టుదల , అంకితభావం కళ్ళముందు కనిపించాయి.లేటెస్ట్ టెక్నాలజీ ఎంతపెరిగినా ఇంకా మూస పద్ధతులే కొనసాగుతున్నాయి. మన దేశంలో ఉన్న పార్లమెంట్ , అన్ని రాష్ట్రాల అసంబ్లీలలో . ప్రతి సమస్యను, భౌగోళిక వివరాలను గూగుల్ ఎర్త్ లేదా గూగుల్ మ్యాప్ ద్వారా కంప్యూటర్ సహకారంతో ఇకముందు కూడా ఇదే పద్ధతిని అందరుకుడా అవలంభిస్తే బాగుంటుంది. వాటిని లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా ప్రజలకు కూడా ప్రతి విషయం సులువుగా అర్థమవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కంప్యూటర్ యుగంలో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలేకాకుండా చిన్న చిన్న సంస్థల్లో, అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో కూడా కంప్యూటర్ లేనిది ఏపనీ ముందుకు సాగడం లేదు .అలాంటప్పుడు ప్రజా ప్రతినిధులు కూడా కంప్యూటర్ ఎందుకు వాడకూడదు? కంప్యూటర్ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటషన్ ఎందుకివ్వ కూడదు? పాత తరం ప్రజాప్రతినిధులకు  కంప్యూటర్ పై అవగాహన ఉండకపోవచ్చు. ఆలాంటి వారికి ప్రభుత్వం శిక్షణ ఇప్పించి కాలంతోపాటు పరిగెత్తేలా తీర్చి దిద్దాలి. అప్పుడే కదా వాళ్ళు ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెల్లగలరు! ఇంకో విషయం ఏమిటంటే. విభేదించాల్సిన విషయాలు ఎన్నైనా ఉండవచ్చు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను వినడానికి ప్రతిపక్ష నాయకులు ఎందుకు నిరాకరించారో కారణం అర్థంకావడంలేదు ? అది విని-చూసి ఏమైనా అభ్యంతరాలున్నా, వాటిపై చర్చించవచ్చు . బాగుంటే అభినందించవచ్చు ,లేదంటే విభేదించవచ్చు. మొత్తం అర్థం చేసుకున్నాక, ప్రాజెక్ట్ల నిర్మాణం త్వరగాచేపట్టాలని కోరవచ్చు. ఇంకేవైనా ప్రతిపాదించవచ్చు ! అందరు ఎల్లప్పుడు పేపర్ చూసి చదివేదాన్ని , ముఖ్యమంత్రి గారు తెరపై చూపించి వివరించారు. దానికి అంత రాద్ధాంతం అక్కరలేకుండే.

– సయ్యద్ రఫీ,

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *