
అల్లు అర్జున్ ఇరగదీశాడు. పవన్ కళ్యాన్ అంటూ నానా యాగీ చేస్తూ సినిమా ఫంక్షన్లను చెడగొడుతున్న అభిమానులకు అదిరిపోయేలా జవాబిచ్చాడు.. నాగబాబు కూతురు నిహారిక తొలిసినిమా ‘ఒక మనసు’ ఆడియో ఫంక్షన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ మాట్లాడారు.
పవన్ అంటూ అరవడం వల్ల సినిమా ఫంక్షన్లన్నీ నవ్వుల పాలు అవుతున్నాయని.. అలాంటి అభిమానుల వల్ల కోట్లు పెట్టిసినిమా తీసిన దర్శకుడు, నిర్మాతలు తమ సినిమా విషయాలను షేర్ చేసుకోవడం లేదని మండిపడ్డారు. బయటి సినిమా ఫంక్షన్లలో కూడా పవన్ అభిమానులు అరవడం సిగ్గుచేటులా తయారైందని అల్లు అర్జున్ నిప్పులు చెరిగాడు..
పవన్ అంటే తనకు చాలా అభిమానమని..కానీ ఆ అభిమానం పేరు చెప్పి నానాయాగీ చేస్తే సంహించేది లేదని హెచ్చరించారు. ఇకనైనా పవన్ అభిమానులు సినీ ఫంక్షన్లలో అల్లరిని మానుకోవాలని సూచించారు.
అల్లు అర్జున్ పవన్ గురించి మాట్లాడిన మాటలు పైన వీడియోలో చూడొచ్చు..