పవన్ కు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

chandrababu naidu and pawan kalyan -02

గుంటూరు,ప్రతినిధి : రాజధాని మంటలు మిత్రపక్షాల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఎన్నికల్లో కలిసి పోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు గుంటూరు రాజధాని విషయంలో మాత్రం విడిపోయారు. రైతుల నుంచి 33 వేల ఎకరాల భూమి రాజధాని కోసం సేకరించడం అవసరమా.? అని ప్రశ్నించిన పవన్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చాడు.

రాజధాని అంటే వెయ్యి , ఐదు వేల ఎకరాల్లో కట్టేది కాదని.. రాజధాని నిర్మిస్తే మల్టీ నేషనల్ కంపెనీలు వస్తాయని రైతుల భూములకు విలువ కూడా పెరుగుతుందని చెప్పారు. ఇన్ఫాస్ట్రక్చర్ వస్తే రైతులు లాభపడతారని.. రాకపోతే ఎంచక్క వ్యవసాయం చేసుకోవచ్చని సూచించారు. పార్టీ ఆఫీసులకే 10 ఎకరాలు సరిపోతే ఒక రాష్ట్రానికి రాజధానికి అన్ని ఎకరాలు అవసరమే అని చంద్రబాబు స్ఫష్టం చేశారు. రాజధానికి వేల కంపెనీలు, బ్యాంకులు, మల్టి నేషనల్ కంపెనీలు వస్తాయని.. వాటన్నింటికి ఈ భూములు అసలే సరిపోవని ఆయన స్పష్టం చేశారు. తాను ఏదైనా ముందుచూపుతో చేస్తానని.. కొందరు రైతులను రెచ్చగొట్టద్దని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *