పల్లె పహాడ్ లో ముగిసిన రాంరెడ్డి అంత్యక్రియలు

పల్లె పహాడ్ లో ముగిసిన రాంరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ : స్వాతంత్ర్య సమరయోధుడు కల్మెకొలను రాంరెడ్డి(96) మంగళవారం తుదిశ్వాస విడిచాడు.  గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు మరణించారు. రాంరెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం పల్లె పహాడ్ గ్రామంలో బుధవారం ఘనంగా జరిగాయి. నాయకులు, జర్నలిస్టులు, గ్రామస్థులు తరలివచ్చి రాంరెడ్డికి ఘన నివాళులర్పించారు. రాంరెడ్డికి భార్య ఆండమ్మ, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.

రాంరెడ్డికి నివాళులు అర్పిస్తున్న చాడ

రాంరెడ్డికి నివాళులు అర్పిస్తున్న చాడ

మన తెలంగాణ దినపత్రిక ఎడిటర్, ఐజేయూ మాజీ సెక్రటరీ జనరల్ కే.శ్రీనివాస్ రెడ్డి ఆయన పెద్ద కుమారుడు. ఆయన ఇద్దరు కుమారులు ప్రభాకర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి లు కూడా జర్నలిజం వృత్తిలో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నల్గొండ జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

నిజాం వ్యతిరేక పోరాటంలో రాంరెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. 1948లో అయన అరెస్ట్ అయ్యారు. మూడేళ్లు జైల్లో కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆయన తుది శ్వాస విడిచేవరకు కమ్మూనిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారు.

పల్లె పహాడ్ లో ముగిసిన రాంరెడ్డి అంత్యక్రియలు

పల్లె పహాడ్ లో ముగిసిన రాంరెడ్డి అంత్యక్రియలు

బుధవారం జరిగిన రాంరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నాయకులు గౌరీ శంకర్, నందిని సిద్దారెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్ నాథ్ , ఎంఏ మాజిద్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సోమసుందర్, ఐవీ సుబ్బారావు, జాతీయ నాయకులు అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేశ్ కుమార్, రవీంద్రనాయక్, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి , విశాలంధ్ర ఎడిటర్ ముత్యాల ప్రసాద్, టీయూడబ్ల్యూజే నాయకులు కే. సత్యనారాయణ, వై నరేందర్ రెడ్డి, అయిలు రమేశ్ , కోటిరెడ్డి, ఏ రాజేశ్ , అంగిరేకుల సాయిలు, శ్రీకాంత్ రెడ్డి, సంపత్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు వానపల్లి సుబ్బారావు, సత్యనారాయణ, చావ రవి, వెంకటేశ్వర్లు, భక్తవత్సలం, షేఖ్ బాబు, సీహెచ్ రాంబాబు, డా. కే. మురళీ మోహన్, చంద్రశేఖర్ నాయుడు, టీయూడబ్ల్యూజే , ఏపీయూడబ్ల్యూజే సంఘాల జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు , ప్రముఖులు, గ్రామస్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *