
పల్లెసీమలే దేశాభివృద్దికి పట్టుకొమ్మలు’ అన్న మహాత్మగాంధీ మాటలను చేతల్లో నిరూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల ప్రగతికి ఎన్నో పథకాలను, కార్యక్రమాలను చేపట్టింది. పట్టణాల్లో లభించే పౌరసేవలన్నీ ఇకపై పల్లెల్లో కూడా లభిస్తాయి. మన పల్లెలు ప్రగతి బాట పయనించాలనే ఆశయంతో బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.. నేటి ఈ పంచాయతీలు తెలంగాణలో ప్రారంభించనున్నారు మంత్రి కేటీఆర్..
నేడు పంచాయతీ రాజ్ మరియు ఐటీ శాఖా మాత్యులు కేటీఆర్ నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం బీబీపేట్ గ్రామంలో ఈ పంచాయతీని ప్రారంభించనున్నారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్బంగా తెలంగాణ వ్యాప్తంగా 104 గ్రామ పంచాయతీల్లో ఈ పంచాయతీలను కార్యక్రమంను ప్రారంభిస్తున్నాయి..
ఇందులో ఆషరా పించన్లు., ఉపాధి హామీ చెల్లింపులు, స్త్రీనిధి, బ్యాంక ఖాతాలు, విద్యార్థులకు వివిధ సర్టిఫికెట్లు అందజేస్తారు.