పర్యావరణ అసమతుల్యతతోనే అనర్దాలు: కె.తారకరామారావు

కరీంనగర్: పర్యావరణ అసమతుల్యతతోనే సకాలంలో వర్షాలు పడక, అకాల వర్షాలతో, విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగి ఎన్నో అనర్దాలు సంభవిస్తున్నాయని, దీనిని సమతుల్యం చేసేందుకు చెట్టు పెంచడం ఒక్కటే మార్గమని రాష్ట్ర్ర ఐటి, పురపాలక, శాకమంత్రి కె.తారక రామారావు అన్నారు. మంత్రి గురువారం సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణకు హరితహరం కార్యక్రమంలో భాగంగా ఒకే రోజు 7లక్షల మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమానికి స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి సిరిసిల్ల మండలంలోని జిల్లెల, నేరెళ్ల, శాంతినగర్ బైపాస్, సిరిసిల్ల కోర్టు
భవనాల సముదాయం, పెద్దూరు, ఎల్లారెడ్డి పేట మండలంలోని రాంరెడ్డి పల్లి, గంభీరావుపేట మండలంలోని లింగన్నపేటల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెద్దూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర్రంలో 24 శాతం వున్న అటవీ సంపదను 33 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణకు హరితహరం కార్యక్రమం చేపట్టినట్లు, చెట్ల పెంపకంతో పర్యావరణ పర్యావరణ సమస్యలు తొలగి వర్షాలు సమృద్దిగా పడతాయని, వర్షాలతో చెరువులు నీటి కళతో నిండి ప్రజలు సమభిక్షంగా వుంటారని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర్రంలో 46 కోట్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే దిశగా చర్యలు చేపట్టిందని, దీనిలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో సుమారు28 లక్షల మొక్కలు నాటనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది ప్రభుత్వ, అధికారుల, ప్రజాప్రతినిధుల కార్యక్రమంలా భావించవద్దని, ప్రజలందరి కార్యక్రమమని సమిష్టిగా, అన్ని వర్గాలవారు భాగస్వాములవ్వాలని మంత్రి అన్నారు. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నట్లే మొక్కలను కాపాడాలని, చిన్నపిల్లలకు మొక్కల సంరక్షణ బాద్యత అప్పగించాలని, అప్పుడే వారికి చెట్ల విలువ తెలుస్తుందని మంత్రి అన్నారు. గత సంవత్సరంలో 18 కోట్ల మొక్కలు నాటినప్పటికి వర్షాలు లేక చాలా మటుకు కాపాడుకోలేకపోయినట్లు, ఈ సంవత్సరం నాటిన మొక్కలను బ్రతికించుకోవడానికి అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు. పెద్ద పెద్ద బ్లాక్ లుగా మొక్కలు నాటితే అక్కడ ప్రభుత్వపరంగా డ్రిప్ సౌకర్యం కల్పించనున్నట్లు
మంత్రి తెలిపారు. ప్రభుత్వపరంగా నిధులను ఆశించేటప్పుడు కార్యక్రమాలు విజయవంతం చేయాలని, ప్రతి గ్రామంలో నలభై వేల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, అట్టి గ్రామాలకు ప్రభుత్వ నిధుల విడుదలలో ప్రాధాన్యతనిస్తామని మంత్రి అన్నారు. అన్ని వర్గాలవారు సమన్వయంతో పనిచేసి తెలంగాణను హరితరాష్ట్ర్రంగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, సంయుక్త కలెక్టర్ ఏ. శ్రీ దేవసేన, రాష్ట్ర్ర సహకార బ్యాంకు చైర్మన్ కోడూరి రవీందర్ రావు, సిరిసిల్ల ఆర్టీవో శ్యాంప్రసాద్ లాల్, డిఆర్ డిఏ పిడి అరుణ శ్రీ, డ్వామా పిడి వెంకటేశ్వర రావు, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.ktr.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *