
సెప్టెంబర్ 15,కరీంనగర్: వినాయక చవితి సంధర్బంగా ప్రజలందరు మట్టితో చేసిన విగ్రహాలనే పూజించాలని జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ అన్నారు. కాలుష్యనియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల వాడకం పై ప్రజల్లో అవగాహన పెంపొందించుటకు ముద్రించిన పోస్టర్లను మంగళవారం క్యాంపు కార్యాలయంలోకలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రసాయనాలరంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేయడం వల్లనీరంతా విషతుల్యమై జీవరాశులు చనిపోతాయని తెలిపారు. మట్టి వినాయకులను పూజించడమే మంగళప్రదమని, పూజఫలం దక్కుతుందనిఅన్నారు. ప్రజల్లో మట్టి విగ్రహాల వినియోగం పై విసృత ప్రచారం చేయాలని సూచించారు.