
రాహుల్ గాంధీ ఏఐసీసీలో భారీ చేర్పులు చేస్తున్నారు. ఎవరికైనా పరీక్షలు పెట్టి అందులో నెగ్గితేనే ఆ పదవి ఇస్తున్నారు. కాగా ఈ ఎన్నికలపై సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యక్షుడిగా మీకు లేని పరీక్షలు, నిబంధనలు మాకు ఎందుకంటూ సంశయపడుతున్నారు. అవే ఎన్నికలు గనుక రాహుల్ కు పెడితే పాస్ మార్కులు కూడా రావని.. మరి తమకోసం ఎందుకిలా పరీక్షలంటూ మథనపడుతున్నారట..
పరీక్షల గోల ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది.. ఎన్నికల్లో డబ్బు.పలుకుబడి, పేరు మాత్రమే పనిచేసే ఈ రోజుల్లో పరీక్షలతో ఎలా రాజకీయ నాయకులను తయారు చేస్తారో రాహుల్ కే తెలియాలి మరి..