
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించి వివాదారహితంగా సమస్యను పరిష్కరించాలని గవర్నర్ నరసింహన్ కు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ అధికారులు దిశానిర్ధేశం చేశారు. పరిస్థితులు చేయిదాటకుండా చూడాలని కోరారు.
సెక్షన్ 8 వ్యవహారం 9,10 షెడ్యుళ్లు.., ఓటుకు నోటు కేసు కేసు, ఏసీబీ దర్యాప్తు, ఫోన్ ట్యాపింగ్, సిట్ దర్యాప్తు తదితరాలపై గవర్నర్ కు హోంశాఖ కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది.