పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నిరంతరం మంచి సంబంధాలుండాలి: ఉప ముఖ్యమంత్రి కడియం

  • జేఎన్టీయు, సిఐఐల మధ్య ఒప్పందం
  • ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధనలో శిక్షణ, ఉపాధి అవకాశాలు
  • ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఒప్పందం
  • పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నిరంతరం మంచి సంబంధాలుండాలి: ఉప ముఖ్యమంత్రి కడియం
  • విశ్వవిద్యాలయాలు,పరిశ్రమలకు మధ్య ఒప్పందాలు కుదుర్చడంలో డిప్యూటీ సిఎం శ్రద్ధ అభినందనీయం – సిఐఐ చైర్మన్ వి.రాజన్న
  • విద్యార్థుల ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే నిరంతర ప్రయత్నంలో ఉన్నాం- జేఏన్టీయు వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి

 

హైదరాబాద్, సెప్టెంబర్ 23 : ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సు చదువుతున్నప్పుడే ఆయా సంస్థల్లో పరిశోధనలో శిక్షణ ఇవ్వడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే ఉద్దేశ్యంతో జేఎన్టీయు, సిఐఐల మధ్య ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఆయన నివాసంలో ఈ రోజు ఒప్పందం జరిగింది. పరిశ్రమలు, విద్యా సంస్థలకు మధ్య ఉన్న గ్యాప్ తగ్గించాలంటే ఈ రెండింటి మధ్య ఒప్పందాలుండాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. ఈనేపథ్యంలో దేశ, విదేశాల్లోని ప్రఖ్యాత కంపెనీలు, సంస్థలతో తెలంగాణ విశ్వవిద్యాలయాలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలలో అవకాశాలు లభిస్తాయని, విద్యార్థి దశలోనే ఆయా కంపెనీలకు కావల్సిన నైపుణ్యాన్ని కూడా పొందడానికి వీలవుతుంది. ఈ ఒప్పందం వల్ల పరిశ్రమలకు కూడా విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లోనే తమకు కావల్సిన నైపుణ్యాన్ని శిక్షణ ఇప్పించేందుకు అవకాశం లభిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు జేఎన్టీయు, సిఐఐల మధ్య ఒప్పందం జేఏన్టీయు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని, అదేవిధంగా పరిశ్రమలకు కూడా ప్రతిభావంతమైన విద్యార్థులను ఎంచుకునే అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలకు మధ్య సంబంధాలు నిరంతరం కొనసాగడం వల్ల వీటి మధ్య ఉన్న గ్యాప్ కూడా తగ్గించవచ్చన్నారు. తద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, పరిశ్రమలకు కొంత శ్రమ తగ్గుతుందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆశించినట్లు తమ విద్యార్థులకు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే విధంగా, నైపుణ్యాన్ని పెంచే విధంగా ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు జేఎన్టీయు వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు. పరిశ్రమలకు, విశ్వవిద్యాలయాలకు మధ్య సంబంధాలు పెంచి, ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చూపుతున్న శ్రద్ధ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సిఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న అన్నారు. విద్య అందించడమే కాకుండా విద్యార్థి దశలోనే ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే మంచి కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి పెడుతున్నారని, దీనివల్ల పరిశ్రమలకు, విద్యా సంస్థలకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏన్టీయు రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్. యాదయ్య, జేఏన్టీయు జె-హబ్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయకుమారి, సిఐఐ తెలంగాణ డైరెక్టర్ ఎస్వీ రాజీవ నాగ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *