పరిశ్రమలు, ఐటి శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్ష సమావేశం

పరిశ్రమలు, ఐటి శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్ష సమావేశం

టి ఫైబర్ అద్యర్యంలో చేపడుతున్న టెక్నాలజీ డెమాస్ట్రేషన్ నెట్ వర్క్ (TDN) మరో రెండు వారాల్లో పూర్తి

ఈ- హెల్త్, ఈ- ఎడ్యుకేషన్, ఈ- గవర్నెనెన్స్ రంగాల్లో టి ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రానున్న మార్పులను ఈ నెట్వర్క్ తో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం

జూన్ నాటికి తొలి దశ టి-వర్క్స్ సిద్దం

వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు పైన మంత్రి సమీక్ష

డ్రైపోర్టుల, గ్రీన్ ఇండస్ర్టియల్ యంయస్ యంఈ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెగా పుడ్ పార్కు, సీడ్ పార్కుల పనుల పురోగతిపైన సమీక్ష

పరిశ్రమల శాఖతోపాటు, ఐటి శాఖ పరిధిలో కొనసాగుతున్న పలు కార్యక్రమాలను మంత్రి కెటి రామరావు ఈరోజు బషీర్ బాగ్ లోని టియస్ ఐఐసి కార్యాలయంలో అయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఐటి శాఖ పరిధిలోని టి- ఫైబర్, టి- వర్క్స్, టి క్లౌడ్ వంటి కార్యక్రమాల పురోగతిని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. టి ఫైబర్ అద్యర్యంలో చేపడుతున్న టెక్నాలజీ డెమాస్ట్రేషన్ నెట్ వర్క్ (TDN) మరో రెండు వారాల్లో పూర్తి అవుతుందని అధికారులు మంత్రికి తెలిపారు. మహేశ్వరంలోని 4 నాలుగు గ్రామాల్లో ఈ నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయని, ఇవి పూర్తయితే ఈ హెల్త్, ఈ ఎడ్యుకేషన్, ఈ గవర్నెనెన్స్ రంగాల్లో టి ఫైబర్ ప్రాజెక్టు ద్వారా రానున్న మార్పులను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారా కలిగే ప్రయోజనాలను రానున్న వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సులో ఈ నెట్ వర్క్ ద్వారా ప్రదర్శిస్తామని మంత్రి తెలిపారు. వచ్చే వారం ఈ నెట్ వర్క్ ను క్షేత్రస్దాయిలో పరిశీలించాలని ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ను అదేశించారు. టి- వర్స్క్ (T-Works: Hardware Incubator) డిజైన్లకు తుది అమోదం లభించిందన్నారు. ఈ డిజైన్లను మేరకు టి వర్క్స్ మొదటి దశ జూన్ నాటికి పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు. టి-క్లౌడ్ (T-Cloud) ఏర్పాటు కోసం ఐటి శాఖ చేపడుతున్న పనిని మంత్రి సమీక్షించారు. టి క్లౌడ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఇలాంటి కార్యక్రమం చేపట్టిన దేశాలు, లేదా రాష్ర్టాలుంటే వాటి అనుభవాలను అధ్యయనం చేయాలని మంత్రి అదేశించారు.

టియస్ యఐఐసి చేపడుతున్న పలు కార్యక్రమాలను సైతం మంత్రి ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్కు పైన మంత్రి సమీక్షించారు. ఇప్పటికే పార్కుకు పర్యావరణ శాఖానుమతులు లభించాయని అధికారులు తెలిపారు. పార్కు లే అవుట్ పూర్తి అయిందని, పలు రోడ్లు, నీటి సౌకర్యాల తాలుకు నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని తెలిపారు. నీటి సౌకర్యం అందించేందుకు అవసరం అయిన 50 కోట్ల నిధులు ఇప్పటికే మంజూరీ అయ్యాయని తెలిపారు. మెగా టెక్స్ టైల్ పార్కులో అవసరం అయిన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ 20 ఎకరాల స్ధలాన్ని కోరినట్లు మంత్రికి అధికారులు తెలిపారు. పార్కు పనులు వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే పార్కులలో పెట్టుబడులకు అంగీకరించిన కంపెనీల పనులు క్షేత్ర స్ధాయిలో పారంభం అయ్యేలా చూడాలన్నారు. కంపెనీలతో కలసి పనిచేస్తున్నామని, టెక్స్ టైల్ పార్కు పనులు సకాలం పూర్తి అవుతాయని అధికారులు మంత్రి తెలిపారు. పార్కు పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మేల్యే ధర్మారెడ్డి సహాకారం తీసుకోవాలని మంత్రి టియస్ ఐఐసి అధికారులకు అదేశాలు జారీ చేశారు. డ్రైపోర్టుల ఏర్పాటుపైన మంత్రి సమీక్షించారు. వీటి ఏర్పాటు కోసం ఇంతకు ముందు గుర్తించిన భువనగిరి, జహీరాబాద్, జడ్జర్ల లాంటి ప్రాంతాలతోపాటు రాష్ర్టానికి నలు వైపుల ఉన్న మరిన్ని ప్రాంతాలను పరిశీలించాలన్నారు. టియస్ ఐఐసి చేపట్టిన మెడికల్ డివైసెస్ పార్కు పురోగతి పైన సమీక్షించిన మంత్రి ఇప్పటికే అక్కడ 9 కంపెనీలకు అమనుమతులు ఇచ్చామన్నారు. దీంతోపాటు దండు మల్కారంలోని గ్రీన్ ఇండస్ర్టియల్ యంయస్ యంఈ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, మెగా పుడ్ పార్కు, సీడ్ పార్కుల పనుల పురోగతిని మంత్రి అడిగి తెల్సుకున్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, టియస్ ఐఐసి యండి నర్సింహా రెడ్డి, టి ఫైబర్ యండి సుజయ్ కారంపూరి, పరిశ్రమలు, ఐటి శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *