పరకాలలో టీయూడబ్ల్యూజే ర్యాలీ

tuwj

పరకాల : జర్నలిస్టుల హక్కుల సాధన కోసం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పరకాలలో ర్యాలీ నిర్వహించింది. వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని పుష్పాంజలి గార్డెన్ లో యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి , టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్, రాష్ట్ర నాయకులు దాసరి కృష్ణరెడ్డి, అయిలు రమేశ్, వరంగల్ జిల్లా టీయూడబ్ల్యూజే   అధ్యక్షులు శివకుమార్ నాయకులు, పరకాల పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం, అక్రడేషన్లు, ఇళ్లస్థలాలు, హెల్త్ కార్డులను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ర్యాలీ వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం ఆది నుంచి పాటుపడుతుంది కేవలం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మాత్రమేనని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అద్యక్షులు శివకుమార్, నాయకులు నరసింహరాములు, పరకాల ప్రెస్ క్లబ్ అద్యక్షులు జి.జగదీశ్వర్, పాత్రికేయ మిత్రులు సదానందం, సురేందర్, వెంకటేశ్వర శర్మ, మామిడి శరత్, అయిలయ్య, శ్రీనివాసరెడ్డి
నాయకులు సంపత్ కుమార్, సిరికొండ భాస్కర్,వీణావాణి, గడ్బం కేశవమూర్తి, సాగర్, జగదీశ్వర్, మధు, తోట సుధాకర్, విద్యాసాగర్, కన్న పరుశరాం, జిల్లా  పాత్రికేయులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *