
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలకు సంబంధించిన వివరాలను సెక్రటేరియట్లోని ప్రచార విభాగం (పబ్లిసిటీ సెల్) ద్వారా సకాలం లో మీడియాకు చేరవేస్తూ, ప్రశంసనీయంగా పనిచేస్తున్నదని మహరాష్ట్ర్ర సమాచార శాఖ డైరెక్టర్ శ్రీ అజయ్ అంబేకర్ అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అమలవుతున్న వివిధ కార్యక్రమాల గురించి అధ్యయనానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం శ్రీ అజయ్ అంబేకర్ డైరెక్టర్ అధ్యక్షతన సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీమతి సేరేఖ ముల్యే, శ్రీ ప్రవీణ్ టాకే, విలాస్ బొడాకే అధికారులుగా గల బృందం హైదరాబాదు లో పర్యటించింది. సోమవారం తెలంగాణ సచివాలయంలోని ప్రచార విభాగం (పబ్లిసిటి సెల్) ను సందర్శించిన సందర్భంగా మహరాష్ట్ర్ర సమాచార శాఖ డైరెక్టర్ శ్రీ అజయ్ అంబేకర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పధకాల సమాచారం ప్రచార విభాగం ఇంఛార్జ్ డిప్యూటి డైరెక్టర్ శ్రీ మధుసూధన్ పబ్లిసిటీ సెల్ పనితీరును మహరాష్ట్ర్ర సమాచార శాఖ అధికారుల బృందం నకు వివరించారు. వివిధ శాఖల సమాచారాన్ని మీడియాకు అధునాతన పద్దతుల ద్వారా చేరవేస్తూ, అన్ని శాఖలకు అనుసంధానం గా సనిచేస్తున్నదని తెలిపారు. తదుపరి బృందం అధికారుల సెక్రటేరియట్ లోని మీడియా పాయింట్ ను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగున్నాయని మహరాష్ట్ర్ర సమాచార శాఖ డైరెక్టర్ వ్రీ అజయ్ అంబేకర్ ఈ సందర్భంగా అన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో అమలవుతున్న ఉత్తమంగా ఉన్న వాటిని తమ రాష్ట్ర్రంలో కూడా ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ పధకం చాలా బావుందని, దీన్ని అధ్యయనం చేసి నివేదికను తమ ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. అంతకుముందు సమాచార పౌరసంబంధాల శాఖ కమిసనర్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పధకాల గురించి సమాచార శాఖ పనితీరుపై తెలుసుకున్నారు. అక్రిడిటేషన్ జారీ విధానం, మీడియాకు ప్రకటనల జారీ, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రముఖుల సమావేశాలకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు, జర్నలిస్టులకు రాయితీలు తదితర పధకాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషినల్ డైరెక్టర్ శ్రీ నాగయ్య కాంబ్లే, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శ్రీ ఎల్.ఎల.ఆర్ కిషోర్ బాబు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీమతి సుజాత, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీ యుతులు వెంటేశం, బాస్కర్, మధుసూదన్ శ్రీనివాస్, రీజినల్ ఇన్ఫర్మేషన్ జనీర్లు శ్రీ దామోదర్, విజయ భాస్కర్ రెడ్డి, అకౌంట్స్ అధికారి శ్రీ శౌరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.